TV9: టీవీ 9 రవిప్రకాశ్ కొత్త చానెల్ 'టీవీ 36'?

షార్ట్స్‌లో చూడండి
తెలుగు టీవీ చానెల్ టీవీ9 మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రవిప్రకాశ్, మరో కొత్త చానెల్ ను ప్రారంభించనున్నారు. దానికి 'టీవీ 36' అని నామకరణం చేసినట్టు టీవీ9 మాజీ ఉద్యోగి జకీర్ వెల్లడించారు. హైదరాబాద్, బంజారాహిల్స్ లోని రోడ్ నంబర్ 2లో టీవీ 36 కార్యాలయం ఉంటుందని ఆయన తెలిపారు. తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకులు ఈ చానెల్ కు మద్దతు పలుకుతూ, అవసరమైన సహాయ సహకారాలను అందిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, టీవీ 9 వాటాల అమ్మకం, లోగోల విషయంలో పలు కేసులను రవిప్రకాశ్ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆయనకు ఇటీవలే హైకోర్టు ముందస్తు బెయిల్ ను కూడా మంజూరు చేసింది.

Go Back to Shorts
TV9
TV36
Raviprakash
New Channel

More Telugu News