KTR: ఛాయ్ తాగుదాం రమ్మన్న కేటీఆర్.. 'వద్దు బాబూ' అంటూ తప్పించుకున్న శ్రీధర్‌ బాబు!

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ శాసనసభ  సమావేశాల తొలిరోజు సందర్భంగా లాబీలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అసెంబ్లీ వాయిదా పడిన తరువాత టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, పద్మా దేవేందర్‌ రెడ్డి, బాల్క సుమన్‌ లు వస్తుండగా, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ఎదురయ్యారు.

శ్రీధర్ బాబును పలకరించిన కేటీఆర్‌, "ఛాయ్  తాగుదాం రండి" అంటూ ఆహ్వానించారు. దీనిపై స్పందించిన శ్రీధర్ బాబు "మీతో ఛాయా? ఇంకా ఏమైనా ఉందా? నాకు వద్దు బాబు" అంటూ నవ్వుతూ సమాధానం ఇవ్వడంతో అక్కడ నవ్వులు పూశాయి. ఆపై బాల్క సుమన్‌ ను పలకరించిన శ్రీధర్‌, 'ఏదో వన భోజనాలు పెట్టించినట్టున్నావు' అంటూ జలజాతర కార్యక్రమాన్ని గుర్తు చేస్తూ జోకేశారు.
Go Back to Shorts
KTR
Telangana
Assembly
Sridhar Babu

More Telugu News