అసోం వరద బాధితుల కోసం హీరో అక్షయ్ కుమార్ భారీ విరాళం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అసోం వరద బాధితుల కోసం హీరో అక్షయ్ కుమార్ భారీ విరాళం

  • అసోంను ముంచెత్తుతున్న కుంభవృష్టి
  • రాష్ట్రవ్యాప్తంగా ఉప్పొంగుతున్న నదులు
  • 45 లక్షల మంది నిరాశ్రయులుగా మారిన వైనం
  • వరద గుప్పిట్లో చిక్కుకున్న లక్షలాది వన్యప్రాణులు
గత కొన్నిరోజులుగా వరుణుడు అసోంపై పగబట్టినట్టుగా ప్రతాపం చూపిస్తున్నాడు. దాని ఫలితమే కుండపోత వర్షాలు, ఊళ్లకు ఊళ్లనే మింగేస్తున్న భారీ వరదలు! బ్రహ్మపుత్ర వంటి నదులు పొంగిపొర్లుతుండడంతో దాదాపు 45 లక్షలమంది నిరాశ్రయులయ్యారు. 33 జిల్లాలు వరద బీభత్సంతో వణికిపోతున్నాయి. వీటన్నంటిని మించి వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న కజిరంగ నేషనల్ పార్క్ 90 శాతం జలమయం అయింది. అందులోని లక్షలాది వన్యప్రాణుల పరిస్థితి ఏంటన్నది మరికొన్ని రోజులు ఆగితే కానీ తెలియదు.

ఇలాంటి పరిస్థితుల్లో అసోంను చూసి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ చలించిపోయారు. వెంటనే అసోంకు రూ.2 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. అందులో కోటి రూపాయలు అసోం ముఖ్యమంత్రి సహాయనిధికి, మరో కోటి రూపాయలు కజిరంగ నేషనల్ పార్క్ కు విరాళంగా అందించారు. అంతేగాకుండా, తాను సాయం చేశానని, మీరు కూడా సాయం చేయండి అంటూ అక్షయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు.
Assam
Floods
Akshay Kumar

More Telugu News