ఎందుకో తెలుగు ప్రేక్షకులు నా సినిమాలను ఆదరించడం లేదు: హీరో విక్రమ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎందుకో తెలుగు ప్రేక్షకులు నా సినిమాలను ఆదరించడం లేదు: హీరో విక్రమ్

  • కొత్తదనం కోసం ప్రయత్నించాను 
  • వరుస పరాజయాలు వచ్చిన మాట నిజమే
  • తన సినిమాల పట్ల అనాసక్తి చూపొద్దన్న విక్రమ్ 
తెలుగు .. తమిళ భాషల్లో కథానాయకుడిగా విక్రమ్ కి మంచి క్రేజ్ వుంది. ప్రయోగాత్మక చిత్రాలను చేయడానికి ఆయన ఎక్కువ ఆసక్తిని చూపుతుంటారు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'మిస్టర్ కె కె' కూడా ఒక రకంగా ప్రయోగాత్మక చిత్రమే. ఈ నెల 19వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో విక్రమ్ మాట్లాడుతూ .. "నా గత చిత్రాలు కొన్ని ఆశించిన స్థాయిలో లేకపోవడం నిజమే. అయితే 'స్కెచ్' .. 'సామి 2' సినిమాలు తమిళంలో బాగానే ఆడాయి. తెలుగులో మాత్రం పూర్తిగా నిరాశపరిచాయి. ఎందుకో తెలుగువారు నా సినిమాలను ఆదరించడం లేదనిపిస్తోంది. 'మిస్టర్ కె కె' సినిమాకి వాళ్ల ఆదరణ తప్పకుండా లభిస్తుందనే నమ్మకం వుంది. కొత్తదనం కోసం తాను చేసిన ప్రయత్నాలు కొన్నిసార్లు సరైన ఫలితాలను ఇవ్వలేదనీ, అంతమాత్రన తన సినిమాల పట్ల అనాసక్తి చూపొద్దు" అని ఆయన చెప్పుకొచ్చారు.
Vikram
Akshara Haasan

More Telugu News