వైగో రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయండి: రాజ్యసభ చైర్మన్ కు సుబ్రహ్మణ్యస్వామి లేఖ
- హిందీ భాషకు వ్యతిరేకంగా వైగో మాట్లాడారు
- రాజ్యంగంలోని ఆర్టికల్ 351ని ఉల్లంఘించారు
- ఇది భారతీయులందరినీ అవమానించడమే అవుతుంది
హిందీ అనేది అభివృద్ధి చెందిన భాష కాదని... హిందీలో వచ్చిన ఒకే ఒక సాహిత్య పుస్తకం రైల్వే టైమ్ టేబుల్ మాత్రమేనని వైగో వ్యాఖ్యానించారని సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు. ఇది భారతీయులందరినీ కించపరచడమే అవుతుందని చెప్పారు. పార్లమెంటులో దేశ ప్రధాని ఇంగ్లీషులో మాత్రమే మాట్లాడాలని కూడా వైగో వ్యాఖ్యానించారని తెలిపారు. ఆర్టికల్ 351 ప్రకారం హిందీ అధికార భాషగా చలామణి అవుతోందని చెప్పారు.