ఇదీ కక్షసాధింపే అంటారా చంద్రబాబూ?: వైసీపీ నేత విజయసాయిరెడ్డి
Add ap7am to your home Screen

ఇదీ కక్షసాధింపే అంటారా చంద్రబాబూ?: వైసీపీ నేత విజయసాయిరెడ్డి

  • పోలవరాన్ని బాబు కల్పతరువుగా భావించారు
  • ప్రాజెక్టు అంచనాలను పెంచి దోచుకున్నారు
  • ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన వైసీపీ నేత
టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును కల్పతరువులా భావించారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి విమర్శించారు. ప్రాజెక్టు అంచనాలను పెంచి ప్రతీ పనిలో నిధులు దోచుకున్నారని దుయ్యబట్టారు.

పోలవరం ప్రాజెక్టుతో పాటు జలవిద్యుత్ కేంద్రం నిర్మాణంలో కాంట్రాక్టర్లకు అదనంగా రూ.2,343 కోట్లు దోచిపెట్టినట్లు నిపుణుల కమిటీ తేల్చిందని వ్యాఖ్యానించారు. దీన్ని కూడా కక్షసాధింపు అనే అంటారా? అని చంద్రబాబును విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Andhra Pradesh
YSRCP
Vijay Sai Reddy
Chandrababu
Telugudesam

More Telugu News