ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలను స్వీకరించిన రోజా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలను స్వీకరించిన రోజా

  • ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన రోజా
  • పలు సమీకరణాల వల్ల రోజాకు దక్కని మంత్రి పదవి
  • కీలకమైన పదవిని అప్పగించిన జగన్
వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా బాధ్యతలను చేపట్టారు. తన ఛాంబర్ లో ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం బాధ్యతలను స్వీకరించారు. ఏపీ కేబినెట్ లో చోటు లభిస్తుందని రోజా భావించారు. ఆమెకు మంత్రి పదవి ఖాయమనే ప్రచారం కూడా భారీ ఎత్తున జరిగింది. అయితే పలు సమీకరణాల నేపథ్యంలో, ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో, ఆమె ఎంతో నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో, ఆమెను ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా నియమిస్తూ ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేశారు.
Roja
APIIC
Chairperson
YSRCP

More Telugu News