ఆరోగ్యశ్రీ పథకానికి, రామాయణంలో సంజీవని మొక్కకు పోలిక పెట్టిన బుగ్గన!
- ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి
- సంజీవని మొక్క తరహాలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ తీసుకువచ్చారన్న బుగ్గన
- బెంగళూరు, చెన్నై ఆసుపత్రులు కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి!
బెంగళూరు, చెన్నై వంటి మహానగరాల్లో ఉన్న ఆసుపత్రులను కూడా ఆర్యోగశ్రీ సేవల జాబితాలో చేర్చుతామని, అవసరమైన వారు ఆ నగరాల్లోని ఆసుపత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేయించుకోవచ్చని బుగ్గన వివరించారు. దీనికోసం రూ.1740 కోట్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. ఇక, ఆరోగ్యశ్రీ పథకం తాజా అర్హత వివరాల గురించి చెబుతూ, వార్షికాదాయం రూ.5 లక్షల లోపు ఉన్న ప్రతి కుటుంబం ఆర్యోగశ్రీకి అర్హత పొందుతుందని వెల్లడించారు. ఆసుపత్రి ఖర్చులు రూ.1000, అంతకు మించిన పరిస్థితుల్లో చికిత్సకయ్యే వ్యయంపై పరిమితి లేకుండా వైద్యసేవలు అందిస్తామని వివరించారు.