హైదరాబాద్‌లో ఘోరం.. ఇంటర్ విద్యార్థిని ఢీకొట్టి ఈడ్చుకుపోయిన లారీ
- స్నేహితులతో కలిసి బైక్‌పై వస్తుండగా ఘటన
- చికిత్స పొందుతూ మృతి చెందిన విద్యార్థి
- స్వల్ప గాయాలతో తప్పించుకున్న మరో ఇద్దరు
అదే సమయంలో వెనక నుంచి వేగంగా వస్తున్న లారీ సాయికృష్ణ పైనుంచి దూసుకెళ్లింది. అదే బైక్‌పై ఉన్న సాయి స్నేహితులు గోగుల ఆదిత్య (17), బి.ప్రశాంత్‌లు స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. ఇక, సాయిని ఈడ్చుకుంటూ వెళ్లిపోయిన లారీ ఖైరతాబాద్ హనుమాన్ టెంపుల్ దగ్గర ఆగగా, దానికి సాయి చిక్కుకుని రక్తమోడుతూ కనిపించాడు. వెంటనే అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.