అమెరికా పర్యటనలో ఖర్చులు తగ్గించుకునేందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ సరికొత్త ఐడియా!
- వాషింగ్టన్ లో ఓ దౌత్యాధికారి ఇంట్లో బస
- బాగా క్షీణించిన పాక్ ఆర్థికస్థితి
- సాయం ప్రకటించి సలహా ఇచ్చిన ఐఎంఎఫ్
త్వరలో అమెరికా పర్యటనకు వెళుతున్న ఇమ్రాన్ అక్కడ ఖరీదైన స్టార్ హోటల్లో బసచేయడానికి బదులుగా, వాషింగ్టన్ లోని ఓ పాక్ దౌత్యాధికారి నివాసంలో ఉండాలని నిర్ణయించుకున్నారు. అలాగైతే ఖర్చులు భారీగా తగ్గుతాయని, నిరాడంబరంగా ఉన్నట్టుంటుందని ఇమ్రాన్ భావిస్తున్నారు. పైగా, ఐఎంఎఫ్ ను సంతృప్తి పరిచినట్టుగా కూడా ఉంటుందని పాక్ ప్రధాని యోచన. జూలై 21 నుంచి ఇమ్రాన్ అమెరికాలో పర్యటిస్తుండగా, దౌత్యాధికారుల నివాస ప్రాంగణంలో బసకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశాలు అందాయి.