Nara Lokesh: ఏపీలో పగబట్టిన పాములు రాజ్యమేలుతున్నాయి... అందుకు ఈ వీడియోనే సాక్ష్యం: లోకేశ్

షార్ట్స్‌లో చూడండి
వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా టీడీపీ నేత నారా లోకేశ్ ట్వీట్ల పరంపర కొనసాగుతోంది. తాజాగా మరో ట్వీట్ తో జగన్ ప్రభుత్వంపై లోకేశ్ విరుచుకుపడ్డారు. వర్షాకాలం కావడంతో పాములు బయటికొస్తున్నాయని మీడియాలో రాస్తున్నారని, కానీ, ఏపీలో పగబట్టిన పాములే రాజ్యమేలుతున్నాయని విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. తమకు వ్యతిరేకంగా ఎలాంటి వార్త రాసినా విలేకరులు ఇబ్బందులు పడతారంటూ వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారని, ఏపీయూడబ్ల్యూజే సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే గణేశ్ పక్కనుండగానే ఈ తరహా బెదిరింపులు చేశారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు ఈ వీడియోనే సాక్ష్యం అంటూ ట్విట్టర్ లో ఓ వీడియో పోస్టు చేశారు. 
Go Back to Shorts
Nara Lokesh
Andhra Pradesh
YSRCP
Telugudesam

More Telugu News