అమర్ నాథ్ యాత్రలో జారిపడ్డ రాళ్లు.. భక్తులకు తగలకుండా కవచంలా నిలబడ్డ ఐటీబీపీ జవాన్లు!
- కశ్మీర్ లోని కాళీమాత మార్గ్ వద్ద ఘటన
- భద్రత కోసం ఐటీబీపీ జవాన్ల మోహరింపు
- జవాన్లపై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
ఇందులో కొండపై నుంచి రాళ్లు జారిపడుతుండగా అవి భక్తులకు తగలకుండా ఐటీబీపీ జవాన్లు అడ్డుగోడలా నిలబడి రాళ్లను అడ్డుకున్నారు. అమర్ నాథ్ యాత్రకు కశ్మీర్ లోని కాళీమాత మార్గ్ ద్వారా భక్తులు వెళుతుండగా ఈ రాళ్లు జారిపడ్డాయి. దీంతో అక్కడే రక్షణగా నిలిచిన జవాన్లు వాటిని తమకు ఇచ్చిన ఫైబర్ కవచాలతో అడ్డుకున్నారు. దీంతో భక్తులు సురక్షితంగా ముందుకు కదిలారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఐటీబీపీ జవాన్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.