హైదరాబాదు నగరంలో భారీ వర్షం పడే అవకాశం

  • తెలంగాణలో చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు
  • హైదరాబాదు పరిధిలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
  • రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు, రేపు వర్షం పడే సూచన
హైదరాబాదు పరిధిలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని... దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
Go Back to Shorts
hyderabad
telangana
monsoon
rain

More Telugu News