Telangana: రేపటి నుంచి బోనాల పండుగ.. ప్రత్యేక పాటను విడుదల చేసిన బిత్తిరి సత్తి!

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో గోల్కొండ బోనాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆషాఢ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వెళతారని ఓ నమ్మకం. అందుకే భక్తులు బోనాల పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను నైవేద్యంగా సమర్పిస్తారు.

ఈ బోనాల పండుగ రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రముఖ నటుడు, యాంకర్ బిత్తిరి సత్తి బోనాలపై పాడిన ప్రత్యేక పాటను విడుదల చేశారు. ఈ పాటను డా. కందికొండ రాయగా, భోలే షావలి సంగీతం సమకూర్చారు. ఈ పాటను మీరూ చూసేయండి.
Go Back to Shorts
Telangana
bonalu
special song
bittiri satti
release

More Telugu News