మీ రికార్డులను మీరే తిరగ రాస్తున్నారు: విజయసాయిరెడ్డిపై దివ్యవాణి ఫైర్
- రోడ్డు కోసం ఖర్చును భారతి సిమెంట్స్ వెచ్చించిందా?
- బారికేడ్ల నిర్మాణానికి కార్మెల్ ఏషియా చెల్లించిందా?
- మరుగుదొడ్లను జగతి పబ్లికేషన్స్ నిర్మించిందా?
జగన్ ప్యాలెస్ వద్ద బారికేడ్ల నిర్మాణానికి రూ.75 లక్షలను కార్మెల్ ఏషియా చెల్లించిందా? అంటూ దివ్యవాణి విరుచుకు పడ్డారు. అలాగే జగన్ నివాసం వద్ద మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.30 లక్షలను జగతి పబ్లికేషన్స్ నుంచి ఖర్చు చేశారా? అని నిలదీశారు. మీ రికార్డులను మీరే తిరగ రాస్తున్నారని, ఇక మిగిలింది గుడిలో లింగం మాత్రమేనని దివ్యవాణి తన పోస్టులో పేర్కొన్నారు.