Haya Bint Al Hussain: రూ.270 కోట్లతో ఇంటి నుంచి పారిపోయిన జోర్డాన్ యువరాణి!

షార్ట్స్‌లో చూడండి
సుమారు 31 మిలియన్ పౌండ్లు అంటే మన కరెన్సీలో రూ.270 కోట్లకు పైనే తీసుకుని జోర్డాన్ యువరాణి, దుబాయ్ ప్రధాని షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్ అల్‌ మక్టోమ్‌ ఆరో భార్య హయా బింట్ అల్‌ హుస్సేన్‌ తన పిల్లలతో ఇల్లు వదిలి వెళ్లిపోయినట్లు మీడియా వర్గాలు తెలిపాయి. కొన్ని రోజుల క్రితం ఈమె విడాకులు కోరినట్టు తెలుస్తోంది. కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకే ఆమె ఇంటి నుంచి పారిపోయినట్టు సమాచారం. జర్మనీ అధికారులను రాజకీయ ఆశ్రయం కోరిన మీదట, తన పిల్లలు జలీలా(11), జాయేద్‌(7)తో కలిసి జర్మనీ వెళ్లడానికి నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఆమె ఇంటి నుంచి పారిపోవడానికి జర్మనీలోని ఓ ప్రతినిధి సాయం చేశారని ప్రచారం జరుగుతోంది. అయితే తన భార్యను తిరిగి అప్పగించాలని దుబాయ్ ప్రధాని షేక్ మహ్మద్ బిన్ రషీద్ కోరినప్పటికీ జర్మనీ అధికారులు అందుకు ఒప్పుకోలేదని తెలుస్తోంది. అయితే యువరాణి ఇల్లు వదిలి పారిపోయిన విషయమై స్పందించిన కుటుంబ సన్నిహితులు, మహ్మద్ బిన్ రషీద్ నుంచి ఆమె విడాకులు కోరుకుంటున్నారని, ఈ నేపథ్యంలోనే ఆమె ఇల్లు వదిలి పారిపోయి ఉండవచ్చని పేర్కొన్నారు.
Go Back to Shorts
Haya Bint Al Hussain
Jaleela
Jayed
Germany
Md Bin Rasheed

More Telugu News