నటి రాధిక దంపతుల అరెస్ట్ కు కోర్టు ఆదేశాలు!
Add ap7am to your home Screen

నటి రాధిక దంపతుల అరెస్ట్ కు కోర్టు ఆదేశాలు!

  • రేడియన్స్ కు ఇచ్చిన చెక్ బౌన్స్
  • కోర్టును ఆశ్రయించిన మీడియా సంస్థ
  • స్పందించకపోవడంతో అరెస్ట్ కు ఆదేశం
దక్షిణాది సెలబ్రిటీ జంట శరత్‌కుమార్, రాధికలను అరెస్ట్‌ చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, రేడియన్స్‌ మీడియా సంస్థకు శరత్‌కుమార్, రాధికలు, నిర్మాత లిస్టిన్‌ స్టీఫెన్‌ లు రూ. 2 కోట్లు చెల్లించాల్సి వుండగా, దీనిపై గతంలోనే కేసు నమోదైంది. తమకు ఇవ్వాల్సిన రూ. 2 కోట్లను వారు ఇవ్వడం లేదని రేడియన్స్ సంస్థ కోర్టును ఆశ్రయించగా, కోర్టు పలుమార్లు వారికి నోటీసులు అందించింది. కోర్టు నోటీసులకు ఈ జంట స్పందించకపోవడంతో వారిని అరెస్ట్ చేయాలని చెన్నైలోని సైదాపేట కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

లిస్టిన్ స్టీఫెన్ తో కలిసి శరత్ కుమార్, రాధికలు సినిమాలు నిర్మించిన వేళ, రేడియన్స్ నుంచి రుణం తీసుకుని, దాన్ని తీర్చేందుకు రూ. 2 కోట్లకు పైగా చెక్కిచ్చారు. ఇది బౌన్స్ కావడంతో సదరు సంస్థ సైదాపేట కోర్టును ఆశ్రయించింది. తాజాగా, వారిని అరెస్ట్‌ చేయాల్సిందిగా న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేస్తూ, కేసు తదుపరి విచారణను జూలై 12వ తేదీకి వాయిదా వేశారు.
Radhika
Sarathkumar
Arrest
Court

More Telugu News