ఒక్క అవకాశమిస్తే ఈవీఎంలను ట్యాంపర్ చేసి చూపిస్తా: తమిళ నటుడు
- ఈవీఎంలను ట్యాంపర్ చేయొచ్చు
- కోర్టు పర్యవేక్షణలోనే నిరూపిస్తా
- సుప్రీంకోర్టులో నటుడు మన్సూర్ అలీ ఖాన్ రిట్ పిటిషన్
సుప్రీంకోర్టు, లేదంటే హైకోర్టు పర్యవేక్షణలో ఈవీఎంలను ట్యాంపర్ చేసి, అవకతవకలకు అవకాశం ఉందని నిరూపిస్తానని మన్సూర్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని దిండిగుల్ స్థానం నుంచి మన్సూర్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంల అవకతవకలు జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో మన్సూర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.