అప్పట్లో వైఎస్ ప్రజల్లో పరువు పోగొట్టుకున్నారు.. ఇప్పుడు జగన్ కూడా అంతే!: దేవినేని అవినాశ్
- వైఎస్ బాబుపై 22 సబ్ కమిటీలు వేశారు
- అయినా ఏ ఆరోపణనూ నిరూపించలేకపోయారు
- జగన్ కు కూడా అలాగే అపహాస్యం తప్పదు
2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై 22 సబ్ కమిటీలు వేశారని అవినాశ్ గుర్తుచేశారు. కానీ ఏ ఆరోపణ కూడా నిరూపించలేకపోయిన వైఎస్ పరువు పోగొట్టుకుని వెనక్కి తగ్గారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు కూడా వైఎస్ తరహాలో అపహాస్యం తప్పదని జోస్యం చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేసిన దేవినేని అవినాశ్ వైసీపీ నేత కొడాలి నాని చేతిలో ఓటమి చవిచూశారు.