chaitu: శేఖర్ కమ్ముల సినిమాకి పూజా కార్యక్రమాలు పూర్తి
చైతూ .. సాయిపల్లవి జంటగా దర్శకుడు శేఖర్ కమ్ముల ఒక సినిమాను రూపొందించనున్నట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఆ విషయాన్ని శేఖర్ కమ్ముల ధృవీకరించాడు. ఈ రోజు ఉదయం ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను సికింద్రాబాద్ గణేశ్ టెంపుల్ లో పూర్తిచేశారు.
ఈ పూజా కార్యక్రమంలో శేఖర్ కమ్ముల .. చైతూ .. సాయిపల్లవితో పాటు నిర్మాతలు పాల్గొన్నారు. ఏషియన్ ఫిల్మ్స్ .. అమిగో క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందనుంది. సెప్టెంబర్ తొలివారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును జరపనున్నారు. డిసెంబర్లో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ ప్రాజెక్టుపై అందరిలో ఆసక్తి వుంది.