ఇందిరాగాంధీ.. గంగానది, మోదీ.. మురికి కాల్వ: అధిర్ రంజన్ తీవ్ర వ్యాఖ్యలు
- ‘ఎక్కడ గంగా మాత, ఎక్కడ మురికి కాల్వ’
- లోక్ సభలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన అధిర్
- ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతల మండిపాటు
ఎక్కడ గంగా మాత, ఎక్కడ మురికి కాల్వ (కహా మా గంగా, కహా గందీ నాలి)? అంటూ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అని విరుచుకుపడ్డారు. ఇదిలాంఉండగా, మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం అధిర్ రంజన్ కు కొత్తేమీ కాదు. గతంలో మోదీని ‘సేల్స్ మ్యాన్’ గా ఆయన అభివర్ణించారు. మోదీ ముందు తాము ఉత్పత్తులను విక్రయించలేకపోయామని సెటైర్లు విసిరారు.