'సిందుబాద్' సినిమా గురించి స్పందించిన అంజలి
- నా తాజా చిత్రం 'సిందుబాద్'
- పెళ్లి చేసుకునే ఆలోచన లేదు
- రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశం లేదన్న అంజలి
"విజయ్ సేతుపతితో కలిసి గతంలో ఒక సినిమా చేశాను. ఆయనతో నాకు ఇది రెండవ సినిమా. ఈ సినిమాలో ఒక గ్యాంగ్ నన్ను కిడ్నాప్ చేస్తుంది. ఆ గ్యాంగ్ బారి నుంచి ఆయన నన్ను ఎలా కాపాడాడనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఇది తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం వుంది. ప్రస్తుతం తెలుగులో రెండు .. తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాను. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాననీ .. రాజకీయాల్లో చేరనున్నానని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఈ రెండు వార్తల్లోను నిజం లేదు" అని ఆమె స్పష్టం చేసింది.