అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తూ వైద్యుడి అసభ్య ప్రవర్తన.. చావబాదిన యువతి బంధువులు
- బీహార్ లో ఘటన
- పోలీసుల రాకతో బతికిపోయిన డాక్టర్
- కేసు నమోదు చేసుకున్న పోలీసులు
ఆ సమయంలో, డాక్టర్ అనిల్ కుమార్ విద్యార్థిని చేతులు పట్టుకుని క్షమించమని ప్రాధేయపడుతున్నాడు. తండ్రి రాకతో ఆ అమ్మాయి వైద్యుడి నీచబుద్ధిని వెల్లడించింది. దాంతో ఆమె తండ్రి తన కుటుంబ సభ్యులను, స్థానికులను పిలిచి, డాక్టర్ అనిల్ కుమార్ పై దాడిచేశారు. ముఖం వాచిపోయేలా కొట్టారు. డయాగ్నొస్టిక్ సెంటర్ ను ధ్వంసం చేశారు. అక్కడున్న ఫర్నిచర్ ను చిందరవందర చేశారు. చివరికి పోలీసుల రాకతో డాక్టర్ అనిల్ కుమార్ బతికిపోయాడు. పోలీసులు అతడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.