నా తమ్ముడు అండగా నిలబడటం వల్లనే ఈ స్థాయికి వచ్చాను: ఎల్బీ శ్రీరామ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా తమ్ముడు అండగా నిలబడటం వల్లనే ఈ స్థాయికి వచ్చాను: ఎల్బీ శ్రీరామ్

  • మొదటి నుంచి నాటకాలంటే పిచ్చి
  •  ఉద్యోగాలు మానేస్తూ ఉండేవాడిని
  • సినిమాల్లో ట్రై చేయమని తమ్ముడే చెప్పాడన్న ఎల్బీ 
రచయితగా .. నటుడిగా .. దర్శకుడిగా ఎల్బీ శ్రీరామ్ కి ఎంతో అనుభవం వుంది. అలాంటి ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన తమ్ముడిని గురించి ప్రస్తావించారు. "మొదటి నుంచి కూడా నాకు నాటకాల పట్ల ఆసక్తి ఎక్కువ. నాటకాలు రాసేవాడిని .. నటించేవాడిని .. దర్శకత్వం వహించేవాడిని. అందువలన చేసే ఉద్యోగంపై దృష్టిపెట్టలేక మానేస్తుండేవాడిని.

ఇలా ఎన్ని ఉద్యోగాలని మానేస్తాం అనిపించింది. అప్పటికే పెళ్లైపోవడం వలన భార్యను ఎలా పోషించడం అనే ఆందోళన మొదలైంది. సినిమాల్లో ట్రై చేయమని మా తమ్ముడు అన్నాడు. ఒక ఏడాదిపాటు గట్టి ప్రయత్నం చేయమనీ, అప్పటివరకూ తాను డబ్బు సర్దుతానని అన్నాడు. వాడికొచ్చే కొంత జీతంలోనే నా కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడు. నా తమ్ముడు నాకు అండగా నిలవడం వల్లనే నేను ఈ రోజున ఈ స్థాయిలో వున్నాను" అని చెప్పుకొచ్చారు.
lb sriram

More Telugu News