ప్రాణాలయినా త్యాగం చేస్తాం.. టీడీపీని కాపాడుకుంటాం!: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర
- విజయసాయిరెడ్డి బ్రోకర్ లా వ్యవహరిస్తున్నారు
- బీజేపీ నియంత తరహాలో పాలన సాగిస్తోంది
- అమరావతిలో మీడియాతో టీడీపీ నేత
అవసరమైతే ప్రాణత్యాగం చేసి అయినా టీడీపీని కాపాడుకునేందుకు సిద్ధంగా ఉన్నామని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. టీడీపీ రాజ్యసభ సభ్యుల ఫిరాయింపు వ్యవహారంలో వైసీపీ నేత విజయసాయిరెడ్డి బ్రోకర్ లా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికే వీలులేదన్న జగన్.. అదే ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఎలా హాజరయ్యారని నిలదీశారు.