Vemulavada: వివాహేతర సంబంధం కారణంగా ఓ వ్యక్తిని నరికి చంపిన దుండగులు

షార్ట్స్‌లో చూడండి
సిరిసిల్ల జిల్లా ములవాడ సుబ్రహ్మణ్యం వీధికి చెందిన నాగుల రవి అనే వ్యక్తిని కొందరు దుండగులు అతి దారుణంగా హత్య చేశారు. వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఏడేళ్ల క్రితం రవి ఓ అమ్మాయిని ప్రేమించాడు. అనంతరం వారిద్దరూ అదృశ్యం కావడంతో పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారిద్దరి ఆచూకీ తెలుసుకుని స్టేషన్‌కు తీసుకొచ్చి కౌన్సెలింగ్ ఇచ్చి వారిద్దరినీ ఎవరింటికి వారిని పంపించారు. అనంతరం ఇద్దరికీ వేర్వేరు వ్యక్తులతో వివాహం జరిగింది.

కొంతకాలం బాగానే ఉన్న ఇద్దరి మధ్య ఇటీవల కాలంలో మళ్లీ చనువు పెరిగి, అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో విషయం తెలుసుకున్న మహిళ భర్త రవి హత్యకు ప్లాన్ చేశాడని, కిరాయి హంతకులతో ఈ హత్య చేయించాడని పోలీసులు నిర్థారించారు. నేటి మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లేందుకు రవి వస్తుండగా అతని ఇంటికి కొద్ది దూరంలోనే మాటు వేసిన దుండగులు అతనిని కత్తితో నరికి చంపేశారు.
Go Back to Shorts
Vemulavada
Ravi
Police
Woman
Councelling
Murder

More Telugu News