ఆ సమయంలో కన్నీళ్లు ఆపుకోలేకపోయాను: ఎల్బీ శ్రీరామ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ సమయంలో కన్నీళ్లు ఆపుకోలేకపోయాను: ఎల్బీ శ్రీరామ్

  • మా అబ్బాయి పెళ్లి మా ఊళ్లో చేశాను
  •  అమ్మాయిని దగ్గరలోనే ఇచ్చుకున్నాను
  •  నా పిల్లలంటే నాకు ఇష్టమన్న ఎల్బీ శ్రీరామ్     
సినీ రచయితగా .. నటుడిగా ఎల్బీ శ్రీరామ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రచన చేసినా .. ఏ పాత్రను పోషించినా అది వాస్తవానికి దగ్గరగా ఉండేలా చూడటం ఆయన ప్రత్యేకత. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన కుటుంబానికి సంబంధించిన ఒక విషయం చెప్పారు.

"నాకు ఒక అబ్బాయి .. ఒక అమ్మాయి. అబ్బాయి పేరు సుపాణి .. గ్రాఫిక్స్ డిపార్టుమెంటులో హెడ్ గా పనిచేస్తూ ఉంటాడు. ఎన్నో కష్టాలుపడి పిల్లలిద్దరికీ మంచి చదువులు చెప్పించాను. అబ్బాయి - అమ్మాయి ఇద్దరూ నా కళ్ల ముందు ఉండాలనేది నా కోరిక. అబ్బాయి పెళ్లి మా ఊళ్లో .. అమ్మాయి పెళ్లి 'శిల్పారామం'లో చేశాను.

అమ్మాయి పెళ్లి అయింది .. అప్పగింతల తంతు మొదలైంది. నేను చాలా పుడింగిని నాకు ఏడుపురాదు అనుకునేవాడిని. కానీ ఆ సమయంలో కన్నీళ్లు ఆగడం లేదు. దాంతో వెంటనే చెట్టు చాటుకి వెళ్లి ఏడ్చేశాను. అక్కడి నుంచి నేను బయటికి వస్తుండటం అక్కడి పనివాళ్లు  చూసి .. "అందరినీ నవ్విస్తారు .. మీరు ఏడుస్తారేంటండీ' అన్నారు అని చెప్పుకొచ్చారు.
lb sriram

More Telugu News