ఇప్పుడు టీడీపీ నేతలు తలకాయను ఎక్కడ పెట్టుకుంటారు అధ్యక్షా?: అంబటి రాంబాబు
- చంద్రబాబుకు సాధ్యంకాని మెజారిటీ జగన్ కు వచ్చింది
- ప్రజలు మాపై చాలా గొప్ప బాధ్యతను మోపారు
- చంద్రబాబు హామీని ఇప్పుడు జగన్ అమలు చేస్తున్నారు
చంద్రబాబు ఐదేళ్ల క్రితం బెల్టు షాపులు రద్దుచేస్తున్నట్లు తొలి సంతకం పెట్టారనీ, కానీ అది అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ ఆ హామీని అమలు చేస్తున్నారని అన్నారు. ‘మీరు ఇచ్చిన హామీని మా నాయకుడు అమలు చేయాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితి వచ్చిదంటే వీళ్లు తలకాయను ఎక్కడ పెట్టుకుంటారు అధ్యక్షా?’ అని ప్రశ్నించారు. బెల్టు షాపులే అపలేనివారు మంచి పరిపాలనను ఎలా అందిస్తారని అంబటి నిలదీశారు.