పెళ్లిమంటపంలో పిలవని పేరంటం!... పరుగులు తీసిన వధూవరులు!
- పెళ్లి వేడుకలో ప్రత్యక్షమైన ఎలుగుబంటి
- వంటకాల వాసనకు ఆకర్షితురాలైన వైనం
- బంధించిన అటవీశాఖ అధికారులు
వంటకాల వాసన పసిగట్టిన ఆ వన్యమృగం నేరుగా వంటశాల వద్దకు వెళ్లింది. దాంతో, వండుతున్న వంటలు అలాగే వదిలేసి వంటవాళ్లు బతుకు జీవుడా అనుకుంటూ పరుగులు తీశారు. ఈ విషయం తెలిసి పెళ్లికొడుకు, పెళ్లికూతురు, పురోహితుడు సహా అందరూ పరుగులు పెట్టారు. అతిథులు సరేసరి! తలో దిక్కుకు పారిపోయారు. అయితే, కొందరు ధైర్యవంతులైన యువకులు ఆ ఎలుగుబంటిని నిలువరించి సమీపంలోని అటవీప్రాంతంలోకి తరిమివేసేందుకు ప్రయత్నించగా, ఆ ఎలుగు నీళ్లులేని బావిలో పడిపోయింది. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా, వలలో దాన్ని బంధించి రక్షిత అటవీప్రాంతంలో వదిలిపెట్టారు.