మావోయిస్టుల చేతిలో పాకిస్థాన్ ఆయుధాలు.. కలకలం
- గురువారం రాత్రి నలుగురు మావోలను మట్టుబెట్టిన భద్రతాబలగాలు
- పాకిస్థాన్ ఆర్మీ ఉపయోగించే రైఫిల్స్ స్వాధీనం
- పాక్ ఆర్మీతో మావోలకు ఉన్న సంబంధాలపై దర్యాప్తు ప్రారంభం
ఈ సందర్భంగా ఒక అధికారి మాట్లాడుతూ, పాక్ ఆర్మీ ఉపయోగించే ఆయుధాలను మావోల నుంచి స్వాధీనం చేసుకున్నామని, ఇతర దేశాలకు చెందిన వారు ఉపయోగించే ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం ఇది రెండోసారని తెలిపారు. గత ఏడాది జరిగిన ఎన్ కౌంటర్లో మృతి చెందిన మావోల నుంచి జర్మనీలో తయారైన రైఫిల్ ను, అమెరికాలో తయారైన సబ్ మెషిన్ గన్ ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.