మీ మనసులో ఏముందో చెప్పండి.. ‘మన్ కీ బాత్’లో నేను మాట్లాడతా!: ప్రధాని నరేంద్ర మోదీ
- ఈ నెల 30న మన్ కీ బాత్ కార్యక్రమం
- టోల్ ఫ్రీ, ఫోరమ్ ద్వారా అభిప్రాయాలు చెప్పాలన్న మోదీ
- ఈ నెల 29లోగా సందేశాలు పంపాలని విజ్ఞప్తి
ప్రజలు టోల్ ఫ్రీ నంబర్ 1800-11-7800కు తమ సందేశాలను రికార్డు చేసి పంపించవచ్చని తెలిపారు. మైగవర్నమెంట్ ఓపెన్ ఫోరమ్ లో కూడా ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చని చెప్పారు. తమ అభిప్రాయాలను ఈ నెల 29లోగా పంపాలని కోరారు. మరో ఫలవంతమైన చర్చ కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ లో స్పందించారు.