నాకు అతనే కావాలి.. ప్రియుడి కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి!
- తెలంగాణలోని పెద్దపల్లిలో జిల్లాలో ఘటన
- రహస్యంగా అనూషాను పెళ్లాడిన శ్రీకాంత్
- కుటుంబ సభ్యుల ముందు వివాహానికి నో
అయితే కుటుంబ సభ్యుల సమక్షంలో తనను వివాహం చేసుకోవాలని కోరడంతో యువకుడు నిరాకరించాడు. దీంతో తనకు పోలీసులు, గ్రామపెద్దలు న్యాయం చేయాలని అనూష వాటర్ ట్యాంక్ ఎక్కింది. ఈ నేపథ్యంలో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, గ్రామపెద్దలు, కుటుంబ సభ్యులు ఆమెను కిందకు దిగాలని కోరారు. ఇందుకు ఆమె అంగీకరించలేదు. చివరికి శ్రీకాంత్ తో పెళ్లి జరిపిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో అనూష ట్యాంక్ నుంచి కింద దిగింది. వారం రోజుల్లోగా తనకు శ్రీకాంత్ తో వివాహం చేయకుంటే ఇదే ట్యాంక్ ఎక్కి, దూకి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇరువురికి పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు.