భట్టి చేస్తున్నది ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష కాదు... పదవీ పరిరక్షణ దీక్ష: బాల్క సుమన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భట్టి చేస్తున్నది ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష కాదు... పదవీ పరిరక్షణ దీక్ష: బాల్క సుమన్

  • కాంగ్రెస్ అంతర్గత పోరులో భాగంగానే భట్టి దీక్ష
  • కాంగ్రెస్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడ్డం సిగ్గుచేటు
  • ఎన్నికైన ప్రభుత్వాలను రద్దుచేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ సొంతం
టీఆర్ఎస్ యువనేత బాల్క సుమన్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షపై తనదైన శైలిలో స్పందించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో భట్టి విక్రమార్క వేదాలు వల్లిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ఆధిపత్య పోరులో భాగంగానే భట్టి దీక్ష చేస్తున్నారని సుమన్ ఆరోపించారు. భట్టిది ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష కాదని, పదవీ పరిరక్షణ దీక్ష అని వ్యంగ్యం ప్రదర్శించారు. దేశంలో ఎమర్జెన్సీ పాలన విధించిన కాంగ్రెస్ నోట ఇవాళ ప్రజాస్వామ్యం అనే పదం రావడం సిగ్గుచేటు అని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను రద్దుచేసిన ఘనచరిత్ర కాంగ్రెస్ పార్టీ సొంతమని అన్నారు.
TRS
Balka Suman

More Telugu News