ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేసిన సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు!
- ప్రారంభమైన 15వ అసెంబ్లీ సమావేశాలు
- జగన్, బాబు చేత ప్రమాణం చేయించిన ప్రొటెం స్పీకర్
- ప్రమాణం చేసిన కొడాలి నాని, మేకపాటి, సుచరిత
వీరిద్దరి తర్వాత మంత్రులు అంజాద్ బాషా, మేకపాటి గౌతమ్ రెడ్డి, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, మేకతోటి సుచరిత తదితరులు కూడా ప్రమాణం చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో విజయదుందుభి మోగించగా, టీడీపీ 23 సీట్లతో రెండోస్థానంలో నిలిచింది. జనసేన పార్టీ రాజోలులో ఖాతా తెరవగలిగింది.