రోజులు గడిచే కొద్దీ నా వయసు తగ్గుతోంది....ఎమ్మెల్యే బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు
- పుట్టడం, చనిపోవడం సహజం
- ఉన్నప్పుడు చేసిన మంచి పనులతో శాశ్వతంగా జీవించవచ్చు
- సేవ చేయడం ఓ విధమైన అదృష్టం
బసవ తారకం ఆసుపత్రి ద్వారా సేవలు, సినిమాల్లో నటన, ఎమ్మెల్యేగా ప్రజా సేవలో ఉండడం తాను అదృష్టంగా భావిస్తున్నానని, ఈ ఉత్సాహంతో తన వయసు తగ్గినట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. పుట్టడం, చనిపోవడం మానవ సహజమని, కానీ బతికి ఉన్నన్నాళ్లు చేసే మంచి పనుల వల్ల ఓ వ్యక్తి చనిపోయినా జనం గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉంటారని అన్నారు. క్యాన్సర్‌పై పోరాడాలన్న నాన్నగారి కలను సాధించేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూపం ఇచ్చారని బాలకృష్ణ గుర్తు చేశారు.