అది అసలే బాలకృష్ణ షూటింగ్ .. ఆలస్యంగా వెళ్లాను: కమెడియన్ ఫిష్ వెంకట్
Add ap7am to your home Screen

అది అసలే బాలకృష్ణ షూటింగ్ .. ఆలస్యంగా వెళ్లాను: కమెడియన్ ఫిష్ వెంకట్

  • అది 'చెన్నకేశవ రెడ్డి' షూటింగ్ 
  • బాలకృష్ణగారి కాంబినేషన్లో సీన్
  •  వినాయక్ గారు చీవాట్లు పెట్టారు
తెలుగు తెరపై రౌడీ లుక్ తో కనిపిస్తూ, అమాయకంగా డైలాగ్స్ చెప్పే హాస్యనటుడిగా ఫిష్ వెంకట్ కనిపిస్తాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించాడు.

"వినాయక్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా 'చెన్నకేశవ రెడ్డి' సినిమా చేస్తున్నాను. మర్నాడు ఉదయం బాలకృష్ణ కాంబినేషన్లో చేయవలసిన సీన్లో నేను కూడా వున్నాను. ఆ రాత్రి స్నేహితులతో పార్టీ చేసుకున్న కారణంగా మెలకువ రాలేదు. 8 గంటలకి వెళ్లవలసిన నేను 10 గంటలకి లొకేషన్ కి వెళ్లాను. అక్కడ అంతా నా కోసం వెయిట్ చేస్తున్నారు. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. వినాయక్ గారు నాకు చీవాట్లు పెట్టారు. తప్పు చేశాను గనుక అలా తలవంచుకుని నుంచుండిపోయాను. వినాయక్ గారిని నా గురువుగారిలా భావిస్తాను. అందుకే ఆయన అంతటితో ఊరుకున్నారు గానీ, మరొకరినైతే ఇంటికి పంపించేసేవారు" అని చెప్పుకొచ్చాడు.
balakrishna
vinayak

More Telugu News