స్పీకర్ తీరుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపాటు!
Add ap7am to your home Screen

స్పీకర్ తీరుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపాటు!

  • ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రహస్య భేటీ ఎందుకు?
  • హైకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉంది
  • సీఎల్పీ విలీనంపై ఎలా నిర్ణయం తీసుకుంటారు?
సీఎల్పీ విలీనం కోరుతూ టీ-కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ తో మాట్లాడే నిమిత్తం ఆయన కార్యాలయానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేశారు. పోచారం అందుబాటులో లేరన్న సిబ్బంది సమాచారంతో ఉత్తమ్ అసంతృప్తికి గురైనట్టు, స్పీకర్ తీరుపై  ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

 ఫిరాయింపు ఎమ్మెల్యేలను స్పీకర్ రహస్యంగా ఎందుకు కలిశారు? స్పీకర్ ను కలిసేందుకు తమకు ఎందుకు సమయమివ్వడం లేదు? అంటూ ఉత్తమ్ నిప్పులు చెరిగినట్టు సమాచారం. ఈ విషయమై హైకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉండగా, సీఎల్పీ విలీనంపై స్పీకర్ ఎలా నిర్ణయం తీసుకుంటారని ఉత్తమ్ మండిపడ్డారు.
Telangana
speaker
pocharam
tpcc
Uttam

More Telugu News