ఇలాంటి అభిమానులు, మద్దతుదారులు ఉండటం నిజంగా నా అదృష్టం!: గంటా శ్రీనివాసరావు
- గంటా విజయంపై మొక్కుకున్న సూర్యనారాయణ
- మొక్కు తీర్చుకునేందుకు కాలినడకన సింహాచలానికి
- ట్విట్టర్ లో స్పందించిన ఏపీ మాజీ మంత్రి
సూర్యనారాయణ నుంచి ఇలాంటి ప్రేమాభిమానాలు పొందిన తాను నిజంగా అదృష్టవంతుడిని అని గంటా వ్యాఖ్యానించారు. తాను ఎన్నికల్లో విజయం సాధించాలనీ, గెలిస్తే సింహాచలం వరకూ కాలినడకన వస్తానని సూర్యనారాయణ మొక్కుకున్నారని చెప్పారు. ఇలాంటి అభిమానులు, మద్దతుదారుల ప్రేమను పొందుతున్న తాను నిజంగానే అదృష్టవంతుడిని అని పునరుద్ఘాటించారు. ఈ మేరకు గంటా శ్రీనివాసరావు ట్వీట్ చేశారు.