దొంగల కోసం వెళ్లిన తెలంగాణ పోలీసులపై రాజస్థాన్ లో దాడి!
Add ap7am to your home Screen

దొంగల కోసం వెళ్లిన తెలంగాణ పోలీసులపై రాజస్థాన్ లో దాడి!

  • రాజస్థాన్ వెళ్లిన వరంగల్ పోలీసులు
  • నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా స్థానికుల దాడి
  • తీవ్రగాయాల పాలైన ఏఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు
ఓ చోరీ కేసుకు సంబంధించిన నిందితులు రాజస్థాన్ లో ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్లిన తెలంగాణ పోలీసులపై స్థానికులు దాడికి దిగడంతో, పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే, వరంగల్‌ సుబేదార్‌ పోలీస్‌ స్టేషన్‌ కు చెందిన ఏఎస్‌ఐ శివకుమార్ సహా ముగ్గురు బేల్వాడ జిల్లా హెర్నియ గ్రామానికి నిందితులను అరెస్ట్ చేసేందుకు వెళ్లారు. నిందితులను పట్టుకునేందుకు వీరు ప్రయత్నించగా, అక్కడే ఉన్న స్థానికులు, ఒక్కసారిగా దాడికి దిగారు. ఈ ఘటనలో ముగ్గురికీ తీవ్రగాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న అక్కడి పోలీసులు, వీరిని బేల్వాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. హెర్నియ స్థానికులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, పోలీసులపై దాడికి దిగిన వారిని గుర్తించే ప్రయత్నాలు ప్రారంభించారు.
Telangana
Police
Rajasthan
Locals

More Telugu News