ఇక జన్మలో నీ కారు ఎక్కనని ఎన్టీఆర్ తో చెప్పేశాను!: హీరో జేడీ చక్రవర్తి
Add ap7am to your home Screen

ఇక జన్మలో నీ కారు ఎక్కనని ఎన్టీఆర్ తో చెప్పేశాను!: హీరో జేడీ చక్రవర్తి

  • ఎన్టీఆర్ ఒళ్లంతా టాలెంటే 
  • ఒక్కోసారి చాలా టెన్షన్ పెట్టేస్తాడు
  •  కళ్లు మూసుకుని కారు నడిపేశాడు
కార్తికేయ కథానాయకుడిగా రూపొందిన 'హిప్పీ' సినిమా, ఈ నెల 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో జేడీ చక్రవర్తి ఒక కీలకమైన పాత్రను పోషించాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆయన బిజీగా వున్నాడు. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఎన్టీఆర్ గురించి ప్రస్తావించాడు.

"తారక్ అంటే నాకు చాలా ఇష్టం .. ఒళ్లంతా టాలెంట్ నింపబడిన వ్యక్తి ఆయన. ఎప్పుడూ సరదాగా వుంటూ నవ్వించే తారక్, ఒక్కోసారి తన పక్కనున్నవారిని ఒక రేంజ్ లో టెన్షన్ పెట్టేస్తాడు. ఒకసారి నన్ను కార్లో ఎక్కించుకుని బయలుదేరాడు. 'మేఘాలలో తేలిపొమ్మన్నది .. 'సాంగ్ ఫుల్ సౌండ్ పెట్టేసి కళ్లు మూసుకుని కారు డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు. అలా ఆయన 110 కిలోమీటర్ల స్పీడ్ తో కారు డ్రైవ్ చేస్తుంటే నేను చాలా భయపడిపోయాను. కారు ఆపిన తరువాత 'ఇక జన్మలో నీ కారు ఎక్కను' అని చెప్పాను .. నిజంగానే ఇంతవరకూ ఎక్కలేదు" అని చెప్పుకొచ్చాడు.  
jd chakravarthi
ntr

More Telugu News