అందరినీ నిరాశ పరుస్తున్నాను... మన్నించండి: ట్విట్టర్ లో హరీశ్ రావు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందరినీ నిరాశ పరుస్తున్నాను... మన్నించండి: ట్విట్టర్ లో హరీశ్ రావు!

  • రేపు హరీశ్ రావు పుట్టినరోజు
  • హైదరాబాద్ లో, సిద్ధిపేటలో ఉండటం లేదు
  • అభిమానులు రావద్దని కోరిన హరీశ్ రావు
సోమవారం నాడు పుట్టిన రోజును జరుపుకోనున్న తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, తన అభిమానులకు ఓ సందేశాన్ని ఇస్తూ, బుధవారం తాను ఎవరికీ అందుబాటులో ఉండటం లేదని తెలిపారు. ఇందుకు మన్నించాలని కోరారు. "మిత్రులకు, అభిమానులకు హృదయపూర్వక నమస్కారములు. నా పుట్టిన రోజు (జూన్-3)న శుభాకాంక్షలు చెప్పడానికి, నన్ను ఆశీర్వదించడానికి వస్తామంటూ ఫోన్లు చేస్తున్న ప్రతీ ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు. మీ అందరిని నిరాశపరుస్తున్నందుకు మన్నించాలి. జూన్ 3న నేను హైదరాబాద్‌ లో కానీ, సిద్ధిపేటలోకానీ ఉండడంలేదు. ముందే నిర్ణయించుకున్న వ్యక్తిగత కార్యక్రమాల్లో భాగంగా నేను దూరంగా ఉండవలసి వస్తోంది. నా పట్ల మీ ప్రేమను సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల ద్వారా చాటాలని కోరుకుంటున్నాను. మీ అభిమానానికి మరోసారి తలవొంచి నమస్కరిస్తున్నాను" అని తన ట్విట్టర్ ఖాతాలో హరీష్ రావు తెలిపారు.



Harish Rao
Birthday
Twitter

More Telugu News