'కార్తికేయ 2'కి రంగం సిద్ధం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'కార్తికేయ 2'కి రంగం సిద్ధం

  • గతంలో హిట్ కొట్టిన 'కార్తికేయ'
  • సీక్వెల్ కి సన్నాహాలు మొదలు
  • నిఖిల్ బర్త్ డే సందర్భంగా ప్రకటన
నిఖిల్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో 'కార్తికేయ' ఒకటిగా కనిపిస్తుంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా, భారీ విజయాన్ని అందుకుంది. ఒక వైపున లవ్ ను .. మరో వైపున సస్పెన్స్ ను కలుపుతూ తెరపై ఆవిష్కరించబడిన ఈ సినిమా యూత్ కి బాగా నచ్చేసింది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచన హీరోకి .. దర్శకుడికి ఉన్నప్పటికీ అందుకు ఇప్పుడు ముహూర్తం కుదిరింది.

 పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రంగం సిద్ధమైంది. రేపు నిఖిల్ పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దర్శక నిర్మాతలు 'కార్తికేయ 2' ప్రకటన చేశారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందనే విషయాన్ని స్పష్టం చేశారు. ఇతర నటీనటులు .. సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు. చందూ మొండేటి 'కార్తికేయ' చివరిలోనే సీక్వెల్ వుంటుందనే సంకేతాలనిచ్చాడు. అక్కడి నుంచే రెండవ భాగం మొదలవుతుందన్న మాట.
nikhil

More Telugu News