కేఎస్ రవికుమార్ తో బాలకృష్ణ సినిమా లేదంటూ ఫిల్మ్ నగర్ టాక్
Add ap7am to your home Screen

కేఎస్ రవికుమార్ తో బాలకృష్ణ సినిమా లేదంటూ ఫిల్మ్ నగర్ టాక్

  • బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ మూవీ
  •  రాజకీయాల నేపథ్యంలో సాగే కథ
  •  కథను పక్కన పెట్టేసిన దర్శక నిర్మాతలు?
కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేయనున్నాడనీ, ఈ సినిమాకి సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడనే వార్త కొన్ని రోజులుగా వినిపిస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అన్నారు. కానీ ఇప్పుడు ఈ కథను పక్కన పెట్టేశారనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.

ఒక ప్రాంతానికి సంబంధించిన రాజకీయాలు .. ఫ్యాక్షన్ నేపథ్యం కలిగిన కథను కేఎస్ రవికుమార్ సిద్ధం చేశాడట. కథలో ఒక తరం విలన్ గా తాత .. మరో తరం విలన్ గా మనవడు కనిపిస్తారట. ఈ పాత్రలు కొందరిని గుర్తుకు తెచ్చేలా ఉండటంతో, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కథను టచ్ చేయకపోవడం మంచిదని పక్కన పెట్టేశారట. మరో కొత్త కథ సిద్ధమయ్యేదాకా బాలకృష్ణ వేచి చూస్తాడో .. బోయపాటితో ముందుకెళతాడో చూడాలి.
balakrishna

More Telugu News