రాఘవేంద్రరావు మా ఇంటికి వచ్చి మరీ షాక్ ఇచ్చారు: హీరో సుమన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాఘవేంద్రరావు మా ఇంటికి వచ్చి మరీ షాక్ ఇచ్చారు: హీరో సుమన్

  • నాకు ఇష్టమైన సినిమా 'అన్నమయ్య'
  • అప్పుడే నాకు నమ్మకం కలిగింది
  •  పాత్ర కోసం నియమ నిష్టలు పాటించాను
తాజా ఇంటర్వ్యూలో హీరో సుమన్ మాట్లాడుతూ, 'అన్నమయ్య' సినిమాను గురించి ప్రస్తావించారు. "నేను ఇంతవరకూ చేసిన సినిమాల్లో నాకు బాగా నచ్చిన సినిమా 'అన్నమయ్య'. ఈ సినిమా షూటింగుకి ముందు ఒక రోజున రాఘవేంద్రరావుగారు మా ఇంటికి వచ్చారు. 'అన్నమయ్య' సినిమా తీస్తున్నాం .. అందులో మీరు వేంకటేశ్వరస్వామిగా నటిస్తున్నారు' అన్నారు.

'ఈ జోక్ వేయడానికి ఇంతదూరం వచ్చారా?' అన్నాను. 'జోక్ కాదు .. నిజమే' అన్నారు ఆయన. ఇప్పుడున్న జనరేషన్ లో వేంకటేశ్వరస్వామిగా మీరైతేనే బాగుంటారు .. కాకపోతే ఆ మేకప్ తో ఎక్కువ సేపు వుండవలసి వస్తుంది' అన్నారు. అప్పటివరకూ అలాంటి పాత్రలు చేయలేదు గనుక, ఆలోచించుకుని చెబుతానని అన్నాను. ఆ తరువాత ఓకే చెప్పేశాను. వేంకటేశ్వరస్వామి గెటప్ తో నన్ను నేను అద్దంలో చూసుకున్న తరువాత నాపై నాకు నమ్మకం కలిగింది. ఎంతో నియమ నిష్టలు పాటిస్తూ ఆ పాత్రను పోషించాను" అని చెప్పారు. 
suman
raghavendra rao

More Telugu News