పరిషత్ ఓట్ల లెక్కింపునకు తేదీ ఖరారు.. 128 లెక్కింపు కేంద్రాల్లో 978 లెక్కింపు హాళ్లలో కొనసాగనున్న కౌంటింగ్
Add ap7am to your home Screen

పరిషత్ ఓట్ల లెక్కింపునకు తేదీ ఖరారు.. 128 లెక్కింపు కేంద్రాల్లో 978 లెక్కింపు హాళ్లలో కొనసాగనున్న కౌంటింగ్

  • 31న శాసనమండలి ఎన్నిక
  • జూన్ 4న ఓట్ల లెక్కింపు
  • పాల్గొననున్న 34 వేల మంది సిబ్బంది
తెలంగాణ వ్యాప్తంగా మూడు విడతల్లో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు తేదీ ఖరారైంది. మొదట మే 27వ తేదీన లెక్కించాలని ప్రభుత్వం భావించింది. అయితే, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి శాసనమండలి ఎన్నిక ఈ నెల 31న జరగనుంది. దీనికి సంబంధించిన ఓట్ల లెక్కింపు జూన్ 3న ఉండటంతో అవి ముగిసిన వెంటనే పరిషత్ ఓట్ల లెక్కింపు చేపట్టాలని నిర్ణయించారు.

ఈ నేపథ్యంలోనే పరిషత్ ఓట్ల లెక్కింపును జూన్ 4న నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఉదయం 8 గంటల నుంచి ఈ లెక్కింపు ప్రారంభం కానుంది. దీని కోసం రాష్ట్ర వ్యాప్తంగా 123 లెక్కింపు కేంద్రాల్లో 978 లెక్కింపు హాళ్లలో ప్రక్రియ కొనసాగనుంది. ఈ లెక్కింపు ప్రక్రియలో సుమారు 34 వేల మంది సిబ్బంది పాల్గొననున్నారు.
MPTC
ZPTC
Telangana
Election
Ranga Reddy
Warangal
Nalgonda

More Telugu News