మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి రావాలంటూ దక్షిణాది సూపర్ హీరోలకు పిలుపు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి రావాలంటూ దక్షిణాది సూపర్ హీరోలకు పిలుపు

  • కమల్, రజనీలకు ఆహ్వానం
  • ఈ నెల 30న మోదీ ప్రమాణస్వీకారం
  • దేశవిదేశాల నుంచి ప్రముఖుల రాక
భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రెండో పర్యాయం ఎన్నికైన నేపథ్యంలో ఆయన ప్రమాణస్వీకార మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారత్ లోని అన్ని రంగాల ప్రముఖులను ఈ వేడుకలో పాల్గొనేందుకు రావాల్సిందిగా ఆహ్వానాలు పంపారు. విదేశీ ప్రముఖులు కూడా మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. కాగా, దక్షిణాది సినీ ప్రముఖులు కమలహాసన్, రజనీకాంత్ లను కూడా ఢిల్లీలో జరిగే ఈ భారీ సంబరంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు.

కమల్, రజనీ అటు సినీ రంగంలోనే కాకుండా ఇప్పుడు రాజకీయాల్లోనూ అడుగుపెట్టి తమదైన ముద్రవేయాలని తపించిపోతున్నారు. అయితే, రజనీ ప్రత్యక్ష పోరాటానికి ఆచితూచి వ్యవహరిస్తుండగా, కమల్ ఇటీవల ఎన్నికల బరిలో తన అభ్యర్థుల్ని దింపి దారుణ పరాజయాల్ని చవిచూశారు. కమల్ మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే.
Narendra Modi
Kamal Haasan
Rajinikanth

More Telugu News