ranveer singh: రణ్ వీర్ సింగ్ కొత్త చిత్రానికి మాస్ టైటిల్

వరుస సినిమాలతో .. వరుస విజయాలతో రణ్ వీర్ సింగ్ దూసుకుపోతున్నాడు. విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ ఆయన ముందుకు వెళుతున్నాడు. ప్రస్తుతం ఆయన కపిల్ దేవ్ బయోపిక్ గా రూపొందుతోన్న '83' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత సెట్స్ పైకి వెళ్లడానికి ఆల్రెడీ మరో ప్రాజెక్టును ఆయన లైన్లో పెట్టేశాడు.

మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని అల్లిన కథాకథనాలతో ఈ సినిమా సాగుతుందట. ఈ సినిమాకి 'జయేశ్ భాయ్ - జోర్దార్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. దివ్యాంగ్ టక్కర్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. '83' మూవీ తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని రణ్ వీర్ సింగ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు
ranveer singh

More Telugu News