KCR: రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న కేసీఆర్... ఘనస్వాగతం పలికిన వైసీపీ నేతలు

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ సీఎం కేసీఆర్ తిరుమల పర్యటన కోసం ఏపీలో అడుగుపెట్టారు. ఈ మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి బయల్దేరిన కేసీఆర్ కొద్దిసేపటి క్రితం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. తిరుమల శ్రీవారి సందర్శన కోసం వచ్చిన ఆయనకు ఎయిర్ పోర్టులో వైసీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. కేసీఆర్ కు స్వాగతం పలికినవారిలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.

అనంతరం భారీ కాన్వాయ్ వెంట రాగా రోడ్డుమార్గం ద్వారా తిరుమల పయనమయ్యారు. దారిపొడవునా కేసీఆర్ ను స్వాగతిస్తూ బ్యానర్లు కనిపించడం విశేషం.  ఈ రాత్రికి ఆయన పద్మావతి గెస్ట్ హౌస్ లో బసచేస్తారు. రేపు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. కేసీఆర్ రాక సందర్భంగా తిరుమలలో భద్రత మరింత పెంచారు. ప్రధాన ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Go Back to Shorts
KCR
Tirumala

More Telugu News