మే 30న జగన్ ప్రమాణ స్వీకారం.. మే 31న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల: వర్మ
- వర్మ తెరకెక్కించిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’
- ఎన్నికల కోడ్ నేపథ్యంలో విడుదల వాయిదా
- వైఎస్సార్, ఎన్టీఆర్ ఆశీస్సులతో అని పేర్కొన్న వర్మ
మే 30న వైసీపీ అధ్యక్షుడు జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని, మే 31న సినిమాను అక్కడ విడుదల చేస్తామని వర్మ పేర్కొన్నారు. ఈ రెండు కార్యక్రమాలు వైఎస్సార్, ఎన్టీఆర్ ఆశీస్సులతో జరగనున్నాయని వర్మ ట్వీట్‌లో తెలిపారు.