కూలికి వెళ్లే విషయంలో గొడవ.. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న భర్త
- శంషాబాద్‌లో ఘటన
- భార్యతో గొడవతో భర్త మనస్తాపం
- భర్త పరిస్థితి విషమం
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీనివాసులు ఇంట్లోని కిరోసిన్‌ను తీసుకుని తన ఒంటిపై పోసుకున్నాడు. అనంతరం అగ్గిపెట్టె కోసం వెతుకుతుండగా భార్య భయంతో పరుగులు తీసింది. ఈ లోగా శ్రీనివాస్ ఒంటికి నిప్పంటించుకున్నాడు. తీవ్రగాయాలపాలైన శ్రీనివాసులును వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.